తప్పిదాలకు తావులేకుండా సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే
. . . కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు బాల్కోండ, బతుకమ్మ: ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరిస్తూ ఇంటింటి కుటుంబ సర్వేలో సమగ్ర సమాచారాన్ని సేకరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. బాల్కొండ మండలం చిట్టాపూర్ గ్రామంలో నిర్వహిస్తున్న ఇంటింటి సర్వే ప్రక్రియను కలెక్టర్ ఆదివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఎన్యుమరేటర్లు ఇంటింటికి వెళ్లి సమాచారం సేకరిస్తున్న తీరును, నిర్ణీత ఫారాలలో ఆయా కోడ్ ల వారీగా వివరాలు నమోదు చేస్తున్న విధానాన్ని పరిశీలించిన కలెక్టర్, సిబ్బందికి పలు సూచనలు...