Batukammanews
Newspaper Banner
Date of Publish : 07 November 2024, 6:33 pm Posted by : ramakrishna

సమగ్ర కుటుంబ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి

– జెడ్పి సీఈఓ ఉష

రుద్రూర్, బతుకమ్మ  : సమగ్ర కుటుంబ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని జడ్పీ సీఈవో ఉషా అన్నారు. గురువారం రుద్రూర్ మండలంలోని బొప్పాపూర్ గ్రామంలో చేపడుతున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను జెడ్పి సీఈఓ ఉష ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎలాంటి తప్పులు లేకుండా కుటుంబ సభ్యుల వివరాలను నమోదు చేసుకోవాలని, కుటుంబ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని ఆమె సూచించారు. ఆమె వెంట పంచాయతీ కార్యదర్శులు, అంగన్వాడీ టీచర్లు తదితరులు ఉన్నారు.