Batukammanews
Newspaper Banner
Date of Publish : 16 November 2024, 7:22 pm Posted by : ramakrishna

సమగ్ర కుటుంబ కుల గణన సర్వేకు సహకరించాలి

: దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరి వెంకటస్వామి గౌడ్

దుబ్బాక బతుకమ్మ ప్రతినిధి : సిద్దిపేట జిల్లా అక్బర్ పేట భూంపల్లి మండలంలోని అక్బర్ పేట గ్రామంలో కుల గణన సర్వేలో పాల్గొన్న దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరి వెంకటస్వామి గౌడ్ మాట్లాడుతూ సమగ్ర కుటుంబ కుల గణన సర్వే ప్రతి ఇంటిలో సర్వే నిర్వహించారు. సామాజిక. ఆర్థిక, విద్య, ఉపాధి రాజకీయ, కుల, ఇతర వివరాలను తెలియజేస్తూ కుటుంబ ఇంటింటా సర్వే ప్రారంభించారు. ప్రతి కుటుంబ వారు సర్వేకు సహకరించాలని ప్రజలను కోరారు. అధికారులు అడిగిన పూర్తి వివరాలను అందించి వారికి సహకరించాలని కోరారు. మీయొక్క పథకాలకు ఈ సర్వే ద్వారా ఏ రకమైన ఇబ్బందులు ఉండవని ఏ పథకమైన రద్దు కాదని కాంగ్రెస్ ప్రభుత్వం పై బురద చల్లే విధంగా కొందరు వ్యవహరిస్తున్నారని అపోహలు నమ్మవద్దని ఇది కుల గణన సర్వే మాత్రమేనని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బాల్తే వెంకటేశం, ఏన్యూమరేటర్ మహేందర్ రెడ్డి పాల్గొన్నారు.