Batukammanews
Newspaper Banner
Date of Publish : 02 November 2024, 5:42 pm Posted by : ramakrishna

అణగారిన వర్గాలకు ఉపయోగపడే విధంగానే సమగ్ర కుల గణన

. . .  రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి

 నిజామాబాద్, బతుకమ్మ:

అణగారిన వర్గాలకు ఉపయోగపడే విధంగానే సమగ్ర కుల గణన చేపడుతున్నట్టు  నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి అన్నారు.జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మనాల మోహన్ రెడ్డి అధ్యక్షతన జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో శనివారం జిల్లా కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి మాట్లాడుతూ సమగ్ర కుల గణన అనేది అన్ని వర్గాల ప్రజలకు మంచి జగడానికే అని, కుల గణన జరిగితే కులంలో ఎందరు ఉన్నారో ఎవరికి ఏవిందంగా న్యాయం చేయగలమో అనే ఉద్దేశం తో ఈ కార్యక్రమ చేపట్టడం జరిగిందని,కుల సర్వే చేయించడం వల్ల కుటుంబాల యొక్క ఆర్థిక పరిస్థితి,ఉంది ఎలా అనే విషయాలు పరిగణనలోకి వస్తాయని,అందుకే దీనిని సమగ్ర కుటుంబ కుల సర్వేగా చేపట్టడం జరిగిందని,ఇది ఎన్నికలకు ముందే తీర్మానించడం జరిగిందని,ఎన్నికల్లో ఎలిచిన తర్వాత అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగిందని,అదేవిధంగా కులగణన అనేది ప్రభుత్వ కార్యక్రమం అయిన కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ ఇందులో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన అన్నారు. పూర్తిగా ఉపకులల వారీగా జాబితా ప్రభుత్వాల వద్ద లేదని,బిజెపి వాళ్ళు సామాజిక న్యాయం చేస్తామని చెప్తున్నారు కానీ కులగణన చేయలేదని,పేదలకు న్యాయం జరగాలన్న, ఉపాధి కావాలన్నా ఆర్థికంగా ఎదగలన్న ఒక నిర్దిష్ట జాబితా వుండాలని,దాని కోసమే కుల గణన అనేది ముఖ్యమని ఆయన అన్నారు. తెలంగాణ లో కులగనన చేసి అందరికీ న్యాయం అందించి దేశనికి ఆదర్శంగా నిలబడమే ప్రభుత్వ ఆలోచన కాబట్టి అందరూ దీనిలో పాల్గొనాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ సమగ్ర సర్వేలో మన జిల్లాలో గ్రామ పంచాయితీ సెక్రటరీ లు,ఆశావర్కర్లు,ఉపాధ్యాయులు ఉన్నారని,వారు సజావుగా సర్వే నిర్వహించడానికి కాంగ్రెస్ కార్యకర్తలుగా వారి వెంట వుండి వారికి సహకరించాలని,సమగ్ర సర్వే అనేది విజయవంతంగా పూర్తి అయ్యేవిందగా చూడాలని అన్నారు. డిసెంబర్ 9 వరకు సర్వే పూర్తి అవ్వాలనే అజెండాతో ముందుకు వెళ్లడం జరుగుతుందని,ఈ ప్రాతిపదికన జనాభాను బట్టి రిజర్వేషన్ నిర్ణయించవచ్చని ,ఇది ప్రజలకు న్యాయం చేయాలనే ఆలోచనతో తీసుకోవడం జరుగుతుందని అన్నారు. కూలగణన పూర్తి అయిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని,కష్టపడ్డ కాంగ్రెస్ నాయకులందరికీ న్యాయం జరుగుతుందని అందరూ సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొనాలని ఆయన అన్నారు. ప్రధాని మోడీ ఇష్టమొచ్చినట్టు అబద్ధాలు మాట్లాడుతున్నాడని తెలంగాణలో ఆరు గారెంటీలు అమలు చేయడం లేదని మాట్లాడుతున్నాడని కానీ తెలంగాణలో మహిళకు ఉచిత బస్సు సౌకర్యం, 200  యూనిట్ల వరకు ఉచిత విద్యుత్,రూ.10 లక్షల వరకు ఆరోగ్య శ్రీ,రూ.500 లకే గ్యాస్ సిలిండర్,వేల ఉద్యోగాల భర్తీ ఎన్ని కార్యక్రమాలు అమలు చేశామని ఆయన అన్నారు. లిక్కర్ కు ,డ్రగ్స్ కు భూముల ఆక్రమణకు సూత్రదరులుగా కేసీఆర్ కుటుంబం వుందని, కేసీఆర్ కుటుంబం అబడలు ఆడటంలో ముందుంటదని ఆయన అన్నారు.ముఖ్యమంత్రి గారు బిసి కమిషన్ ఏర్పాటు చేశారని బిసి లకు వున్న సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేయడం జరిగిందని భూపతి రెడ్డి అన్నారు. బిజెపి నాయకులు చెప్పిన పసుపు బోర్డు ఎక్కడ వుందని,స్మార్ట్ సిటీ ఎక్కడ వుందని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి మాట్లాడుతూ జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం అనేది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సమగ్ర కుల గణన కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ పాల్గొని సక్రమంగా పూర్తి అయ్యే విధంగా దిశా నిర్దేశం చేయడానికి అని ,కావున మండల అధ్యక్షులు గాని ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ప్రభుత్వాధికారులు తమ ప్రాంతంలో కుల సర్వే చేసే సమయంలో వారి వెంట ఉంటూ ప్రతి ఒక్క కుటుంబం సర్వే అయ్యే విధంగా ఏ కుటుంబం కూడా తప్పకుండా సర్వే చేయించడం తమ బాధ్యతగా తీసుకొని పనిచేయాలని ,సమగ్ర కుటుంబ సర్వే ని విజయవంతంగా పూర్తి చేయడం ద్వారా పేద ప్రజలకు అనగారిన వర్గాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఈ కార్యక్రమం ప్రభుత్వ కార్యక్రమం అయినప్పటికీ కలెక్టర్ గారు గానీ ప్రభుత్వ సిబ్బంది పూర్తిగా తమ పనులను నిర్వహిస్తారు అయినా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నిర్ణయం కావున అందరూ పాల్గొనాలని మానాల మోహన్ రెడ్డి కార్యకర్తలకు దిశ నిర్దేశం చేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తహేర్ బిన్ హందాన్,జిల్లా గ్రంథ లయ చైర్మన్ అంతారెడ్డి రాజారెడ్డి,మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, ఐడీసీఎంస్ చైర్మన్ తర చంద్,డిసిసిబి వైస్ చైర్మన్ చంద్ర శేఖర్,రాష్ట్ర కాంగ్రెస్ ప్రచార కమిటీ మెంబర్ జావేద్ అక్రమ్,పీసీసీ కార్యదర్శి వేణు గోపాల్ యాదవ్,రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రామార్తి గోపి,జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు విక్కీ యాదవ్,జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షులు వేణు రాజ్,పిసిసి డెలిగేట్ శేఖర్ గౌడ్ ,మహిళా కాంగ్రెస్ నాయకులు వివిధ మండలల అధ్యక్షులు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

A comprehensive caste enumeration is also useful for the downtrodden sections