ఫోన్ పోయిన వెంటనే సీఈఐఆర్ పోర్టల్ లో ఫిర్యాదు చేయాలి
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : ప్రజలు తమ మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న వెంటనే సీఈఐఆర్ పోర్టల్‌లో ఫిర్యాదు నమోదు చేయాలని, తద్వారా వాటిని త్వరగా గుర్తించే అవకాశం ఉంటుందని పోలీసులు సూచించారు. నిజామాబాద్ టౌన్-I పోలీస్ స్టేషన్ పరిధిలో పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను గుర్తించి వాటి యజమానులకు అప్పగించే కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. సీఈఐఆర్ పోర్టల్ ద్వారా వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి, టౌన్-I పోలీస్ సిబ్బంది సమగ్ర విచారణ చేపట్టి మొత్తం 18 పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను ట్రేస్ చేసిన అనంతరం,...