నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :
ప్రజలు తమ మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న వెంటనే సీఈఐఆర్ పోర్టల్‌లో ఫిర్యాదు నమోదు చేయాలని, తద్వారా వాటిని త్వరగా గుర్తించే అవకాశం ఉంటుందని పోలీసులు సూచించారు. నిజామాబాద్ టౌన్-I పోలీస్ స్టేషన్ పరిధిలో పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను గుర్తించి వాటి యజమానులకు అప్పగించే కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. సీఈఐఆర్ పోర్టల్ ద్వారా వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి, టౌన్-I పోలీస్ సిబ్బంది సమగ్ర విచారణ చేపట్టి మొత్తం 18 పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను ట్రేస్ చేసిన అనంతరం, సరైన ధృవీకరణ ప్రక్రియ పూర్తి చేసి, సంబంధిత మొబైల్ యజమానులకు వాటిని తిరిగి అందజేశారు. ప్రజల సహకారం, సాంకేతిక వనరుల వినియోగంతో ఇలాంటి సేవలను కొనసాగిస్తామని టౌన్-I పోలీస్ అధికారులు తెలిపారు.