సామాజిక వర్గ విస్తృత స్థాయి సమావేశం
ఆర్మూర్, బతుకమ్మ : భీమ్గల్ మండల కేంద్రంలోని మాల సంక్షేమ భవనంలో మాల సామాజిక వర్గ విస్తృతస్థాయి సమావేశం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి రాష్ట్ర కో చైర్మన్ అంగరి ప్రదీప్ పాల్గొని మాలల అస్తిత్వం ఆత్మగౌరవం ఐక్యత అభివృద్ధి కోసం మాల సమాజమంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. జనవరి రెండవ తేదీన నిజామాబాద్ జిల్లాకు విచ్చేయుచున్న ఎస్సీ వర్గీకరణ అధ్యయనం కోసం ఏర్పాటైన ఏకసభ్య కమిషన్ షామిమ్ అక్తర్ కమిటీ కి నిజామాబాద్ జిల్లాలోని...