ఆటోలో మృతదేహాల కలకలం
హైదరాబాద్, బతుకమ్మ: నగరంలోని చాంద్రాయణగుట్టలో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదస్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. రోమన్ హోటల్ లో ఎదురుగా ఉన్న ఓ ఆటోలో ఇద్దరి మృతదేహాలను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటన స్థలాన్నిపరిశీలించి మృతులను జహంగీర్ (24), ఇర్పాన్ (25) గా గుర్తించారు. ఎక్కువగా డ్రగ్స్ తీసుకోవడంతో వారు మృతి చెందినట్లు పోలీసులు భావిస్తున్నారు. అక్కడ మూడు సిరంజీలు లభ్యమయ్యాయి.