కామన్ డైట్ సద్వినియోగం చేసుకోవాలి

కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ కామారెడ్డి, బతుకమ్మ : సంక్షేమ వసతి గృహల్లోని విద్యార్థులకు నూతనంగా ప్రారంభించిన కామన్ డైట్ సద్వినియోగం చేసుకోవాలని, తద్వారా ఉన్నత చదువులు అభ్యసించి మంచి పదవుల్లో రాణించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. శనివారం పెద్దకొడప్గల్ తెలంగాణ సాంఘీక సంక్షేమ శాఖ రెసిడెన్షియల్ స్కూల్, జూనియర్ కళాశాలలో నూతన కామన్ డైట్ ను ప్రారంభించారు. తొలుత కలెక్టర్ కు విద్యార్థినులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు...