Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 August 2025, 3:51 pm Posted by : ramakrishna

జల కళ సంతరించుకున్న చెక్ డ్యాం

మోర్తాడ్, బతుకమ్మ : ఈ సంవత్సరం నైరుతి రుతుపవనాలు ముందుగా వచ్చినప్పటికీ వర్షాలు సక్రమంగా కురవకపోవడంతో రైతులు కొంత ఇబ్బందికి గురైన విషయం తెలిసింది. అడపాదడపా కురిసిన వర్షాలకు గాను గురువారం మధ్య రాత్రిలో కురిసిన కుండా పోత్ వర్షం కు మోర్తాడ్ మండలంలోని ధర్మోరా, పాలెం గ్రామాల మధ్య ఉన్న చెక్ డ్యామ్ జలకళ సంతరించుకుంది. దీంతో భూగర్భ జలాలు పెరిగి పంటలు ఉపండుతాయని ఆయకట్టు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చెక్ డ్యామ్ పై నుంచి నీళ్ళు పొంగి పొర్లడంతో జల దృశ్యాలను ఆస్వాదించడానికి అనేకులు రావడం జరుగుతుంది.