Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 July 2026, 6:10 pm Posted by : ramakrishna

సీఎంపై రేవంత్ రెడ్డి పై కేసు నమోదు చేయాలి

 

. . . బాన్సువాడ బీఆర్ఎస్ నాయకులు

 

బాన్సువాడ, బతుకమ్మ :

 

రాజకీయ ప్రత్యర్థులు, రైతులను ఉద్దేశించి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు హింస ను ప్రేరేపించేలా ఉన్నాయని, ఆయనపై కేసు నమోదు చేయాలని బీఆర్‌ఎస్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు పలువురు బీఆర్‌ఎస్‌ నాయకులు మంగళవారం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి పదవిలో ఉండి హింసను ప్రేరేపించేలా మాట్లాడిన రేవంత్ రెడ్డిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని వినతిలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మాజీ జిల్లా రైతు బంధు కన్వీనర్ దుద్దాల అంజిరెడ్డి, బీఆర్ఎస్వీ నాయకులు ఎర్రవట్టి సాయిబాబా, కౌన్సిలర్ ఫిరోజ్, ఖలీల్, మక్బూల్, మాజీ వార్డు సభ్యులు శ్రీను, అక్బర్, నాయకులు మోచి గణేష్, రమేష్ యాదవ్, చాకలిసాయిలు, శివ సూరి, రహీం తదితరులు పాల్గొన్నారు.

 

A case should be registered against Revanth Reddy.