జీడి సారయ్యపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలి

కామారెడ్డి, బతుకమ్మ : జీడి సారయ్య పైన కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని ధూప దీప నైవేద్య అర్చక సంఘం డిమాండ్  చేసింది. ధూప దీప నైవేద్య అర్చక సంఘం కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో శనివారం  నిర్వహించిన  మీడియా సమావేశంలో  జిల్లా అధ్యక్షులు అంజన్నప్ప మాట్లాడారు.  నాస్తిక సంఘం అధ్యక్షులు జీడి సారయ్య చేసిన అనుచిత  వ్యాఖ్యలను, బ్రాహ్మణుల కించపరుస్తూ చేసిన  వీడియోలను తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు.   వెంటనే సోషల్ మీడియా ద్వారా బ్రాహ్మణులకు క్షమాపణ చెప్పాలని...