Batukammanews
Newspaper Banner
Date of Publish : 29 November 2025, 2:54 pm Posted by : ramakrishna

జీడి సారయ్యపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలి

కామారెడ్డి, బతుకమ్మ : జీడి సారయ్య పైన కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని ధూప దీప నైవేద్య అర్చక సంఘం డిమాండ్  చేసింది. ధూప దీప నైవేద్య అర్చక సంఘం కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో శనివారం  నిర్వహించిన  మీడియా సమావేశంలో  జిల్లా అధ్యక్షులు అంజన్నప్ప మాట్లాడారు.  నాస్తిక సంఘం అధ్యక్షులు జీడి సారయ్య చేసిన అనుచిత  వ్యాఖ్యలను, బ్రాహ్మణుల కించపరుస్తూ చేసిన  వీడియోలను తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు.   వెంటనే సోషల్ మీడియా ద్వారా బ్రాహ్మణులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పూజారులందరం కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. ఈవిషయమై జిల్లా అడిషనల్ ఎస్పీ నరసింహారెడ్డిని  కలిసి  జీడి సారయ్యను వెంటనే అరెస్ట్ చేయాలని ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు.  కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శీర్లవంచ కృష్ణమాచార్యులు, వర్కింగ్ ప్రెసిడెంట్ జగదీశ్వర్ పంతులు, కోశాధికారి భాస్కర్ పంతులు, శివప్రసాద్ పంతులు, నటరాజ్ పంతులు, బసవరాజ్ పంతులు, సంగమేశ్వర్ పంతులు పాల్గొన్నారు.