వైన్ షాప్‌లో చోరీ కేసు చేదన

ఎల్లారెడ్డి, బతుకమ్మ : ఎల్లారెడ్డి పట్టణంలోని త్రిశూల్ వైన్స్ షాపులో ఈనెల 12న జరిగిన దొంగతనం కేసును ఎల్లారెడ్డి పోలీసులు విజయవంతంగా చేధించారు. ఈ కేసులో నిందితుడిని బుధవారం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. సీసీ కెమెరా ఫుటేజ్ ఈ కేసు విచారణలో కీలక పాత్ర పోషించింది. సంఘటన అనంతరం సీసీ కెమెరాలను పరిశీలించిన ఎల్లారెడ్డి పోలీసులు, దొంగతనం చేసిన వ్యక్తిని పాత నేరస్థుడు పోసానిపల్లి గ్రామమానికి చెందిన జంగం నర్సింహులు గా గుర్తించారు. పోసానిపల్లి గ్రామంలోని నిందితుడి ఇంటి వద్ద అతడిని...