Batukammanews
Newspaper Banner
Date of Publish : 15 October 2025, 6:21 pm Posted by : ramakrishna

వైన్ షాప్‌లో చోరీ కేసు చేదన

ఎల్లారెడ్డి, బతుకమ్మ : ఎల్లారెడ్డి పట్టణంలోని త్రిశూల్ వైన్స్ షాపులో ఈనెల 12న జరిగిన దొంగతనం కేసును ఎల్లారెడ్డి పోలీసులు విజయవంతంగా చేధించారు. ఈ కేసులో నిందితుడిని బుధవారం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. సీసీ కెమెరా ఫుటేజ్ ఈ కేసు విచారణలో కీలక పాత్ర పోషించింది. సంఘటన అనంతరం సీసీ కెమెరాలను పరిశీలించిన ఎల్లారెడ్డి పోలీసులు, దొంగతనం చేసిన వ్యక్తిని పాత నేరస్థుడు పోసానిపల్లి గ్రామమానికి చెందిన జంగం నర్సింహులు గా గుర్తించారు. పోసానిపల్లి గ్రామంలోని నిందితుడి ఇంటి వద్ద అతడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితుడు తన కూలీ పనితో వచ్చిన డబ్బులు జల్సాలకు సరిపోక, వైన్ షాపులో చోరీ చేసినట్లు ఒప్పుకున్నాడు. నిందితుడి వద్ద నుండి దొంగతనానికి ఉపయోగించిన ఇనుపరాడ్, రూ.8,500 నగదును స్వాధీనపరచుకున్నారు. నిందితుడిని ఎల్లారెడ్డి కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు పంపినట్లు ఎల్లారెడ్డి సిఐ డి. రాజారెడ్డి, ఎస్‌ఐ బి. మహేష్ తెలిపారు. కేసు చేదనలో చురుకుగా వ్యవహరించిన పోలీస్ కానిస్టేబుళ్లు ప్రేమ్ సింగ్, ఇద్రీష్ మరియు హోం గార్డ్ సంతోష్‌లను ఉన్నతాధికారులు అభినందించారు.