బతుకమ్మ, మాచారెడ్డి: అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న రెండు ట్రాక్టర్ల ను పట్టుకుని కేసు నమోదు చేసినట్లు మాచారెడ్డి ఎస్ఐ అనిల్ తెలిపారు. మాచారెడ్డి మండల కేంద్రంలో ని అంబేద్కర్ విగ్రహం వద్ద ఒకటి, వాడి గ్రామంలో మరో ట్రాక్టర్ ను ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ఇసుక ట్రాక్టర్లను పట్టుకొని కేసు నమోదు చేయడం జరిగింది. ఎవరైనా మండల పరిధిలో అక్రమంగా ఇసుక తరలిస్తే చట్టరీత్యా చర్య తీసుకుంటామని ఆయన వివరించారు.