Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 November 2024, 8:57 pm Posted by : ramakrishna

ఆయుధాలతో బెదిరించిన వ్యక్తులపై కేసు నమోదు 

ఎల్లారెడ్డి, బతుకమ్మ :  ఆయుధాలతో బెదిరించిన వారిపై కేసు నమోదు చేసినట్లు ఎల్లారెడ్డి పోలీసులు తెలిపారు. పోలీసులు కథనం ప్రకారం.. ఎల్లారెడ్డి మండలం రుద్రారం గ్రామానికీ చెందిన గూడ అరవింద్ అనుమానాస్పదంగా ఎల్లారెడ్డి లోని మోడల్ స్కూల్ వద్ద తిరుగుతున్నాడు. అక్కడ ఉన్న కాలేజీ విద్యార్థులు మహేష్,  కాచర్ల చరణ్ మేదరి చరణ్ అను ముగ్గురు ఇక్కడ ఎందుకు తిరుగుతున్నావని అతన్ని అక్కడి నుండి పంపించి వేశారు. ఈ విషయం మనసులో పెట్టుకొని బోడ అరవింద్ ఈనెల 13వ తారీఖున మోడల్ స్కూల్ అయిపోయిన తర్వాత మహేష్  తన ఇంటికి వెళ్తుండగా మోడల్ స్కూల్ పక్కన ఉన్న వెంచర్ లోకి బోడ అరవింద్,  అతని మిత్రులైన భాను ప్రసాద్ ఇర్ఫాన్ తాజుద్దీన్ నలుగురు కలిసి మహేష్ ను తిట్టి కొట్టి వారి వెంట తెచ్చుకున్న గొడ్డలి,  సైకిల్ చైన్ రింగ్ తో చేయబడిన ఆయుధాలను చూపి మళ్లీ తమ జోలికి వస్తే చంపేస్తామని బెదిరించారు.  మహేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.