నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : గంజాయి అమ్ముతున్న వ్యక్తి పై కేసు నమోదు చేసినట్లు ఒకటో టౌన్ ఇన్స్ పెక్టర్ రఘుపతి తెలిపారు. ఆదివారం సాయంత్రం నిజామాబాద్ రైల్వే స్టేషన్ నందు అనుమానాస్పదంగా సంచస్తున్న వ్యక్తిని పట్టుకొని పోలీసులు విచారించారు. మోపాల్ మండలంలోని శ్రీరాం తాండకు చెందిన బామన్ జైల్ సింగ్ ను తనిఖీ చేయగా అతని బ్యాగులో నుంచి దాదాపు 210 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకుని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. బామన్ జైల్ సింగ్ పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.