Batukammanews
Newspaper Banner
Date of Publish : 18 February 2025, 11:09 am Posted by : ramakrishna

వాహనాలు తనిఖీ  చేస్తుండగా ఎస్సైని ఢీకొట్టిన  కారు

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :

నిజామాబాద్ నగరంలోని కోటగల్లి బొందలగడ్డ ప్రాంతంలో వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో ఎస్సైని కారు ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. నగరంలోని 4వ టౌన్ పోలీస్ స్టేషన్ కు చెందిన రెండవ ఎస్సై ఉదయ్ కుమార్ సోమవారం రాత్రి త్రిబుల్ ఎస్ బార్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా అతివేగంగా వచ్చిన కారు ఢీకొట్టడంతో  ఎస్సై తలకు తీవ్ర గాయాలు కాగా చికిత్స నిమిత్తం నగరంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.