బైకును ఢీ కొట్టిన కారు..

ఒకరికి తీవ్ర గాయాలు..   బతుకమ్మ, కోటగిరి :  కారు బైక్ ను ఢీ కొట్టిన ఘటన కోటగిరి  మండల కేంద్రంలో చోటు చేసుకుంది. కోటగిరి మండల కేంద్రానికి చెందిన బర్ల చిన్న మధు అనే వ్యక్తి  బైక్ పై పోతంగల్ నుండి కోటగిరి వస్తుండగా   కోటగిరి నుండి  పోతంగాల్ వైపు వెళ్తున్న కారు ఢీ కొట్టడంతో  బర్ల చిన్న మధు కు తీవ్ర గాయాలు కావడంతో  స్థానికులు స్పందించి ఆసుపత్రి తరలించారు.