Batukammanews
Newspaper Banner
Date of Publish : 17 July 2025, 7:37 pm Posted by : ramakrishna

జిట్టపులి దాడిలో లేగ దూడ మృతి

నిజామాబాద్, బతుకమ్మ : ఉమ్మడి జిల్లాలో గత కొన్ని రోజులుగా పులి సంచారం ప్రజలను ఆందోళనకు గురిచేస్తుంది. పులి జాడ కనుక్కునేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే నిజామాబాద్ జిల్లా సిరికొండ అటవీ రేంజ్ పరిధిలోని పాకాల అడవుల్లో జిట్టపులి దాడిలో లేగ దూడ మృతి చెందండంతో ప్రజలు భయ భ్రాంతులకు గురవుతున్నారు. సంఘటన స్థలాన్ని డిఎఫ్ఓ నికిత, ఆర్మూర్ ఎఫ్డిఓ భవాని శంకర్ పరిశీలించారు.