క్యాలెండర్ కార్యచరణను పురికొల్పుతుంది

జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల   నిజామాబాద్, బతుకమ్మ : ప్రతి వ్యక్తి జీవితంలో సమయానుకూలంగా కార్యచరణను కొనసాగించుకోవడానికి క్యాలెండర్ అతిముఖ్యమైనదని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల అన్నారు. జిల్లాకోర్టు ప్రాంగణంలోని సమావేశపు హల్ లో నిజామాబాద్ జిల్లా జ్యూడిషియల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ 2025 వార్షిక క్యాలెండర్ ను ఆవిష్కరించి ఆమె మాట్లాడారు. దినచర్యకు,కార్యక్రమాల నిర్వహణకు,సభలు, సమావేశాలకు క్యాలెండర్ నే అనుసరించాలని ఆమె పేర్కొన్నారు. అన్ని విషయాల నమోదుకు నమ్ముకోవలసిన మార్గదర్శి క్యాలెండరేనని ఆమె అభివర్ణించారు. అదనపు జిల్లాజడ్జి శ్రీనివాస్ మాట్లాడుతూ ...