Batukammanews
Newspaper Banner
Date of Publish : 31 December 2024, 7:15 pm Posted by : ramakrishna

క్యాలెండర్ కార్యచరణను పురికొల్పుతుంది

జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల

 

నిజామాబాద్, బతుకమ్మ : ప్రతి వ్యక్తి జీవితంలో సమయానుకూలంగా కార్యచరణను కొనసాగించుకోవడానికి క్యాలెండర్ అతిముఖ్యమైనదని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల అన్నారు. జిల్లాకోర్టు ప్రాంగణంలోని సమావేశపు హల్ లో నిజామాబాద్ జిల్లా జ్యూడిషియల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ 2025 వార్షిక క్యాలెండర్ ను ఆవిష్కరించి ఆమె మాట్లాడారు. దినచర్యకు,కార్యక్రమాల నిర్వహణకు,సభలు, సమావేశాలకు క్యాలెండర్ నే అనుసరించాలని ఆమె పేర్కొన్నారు. అన్ని విషయాల నమోదుకు నమ్ముకోవలసిన మార్గదర్శి క్యాలెండరేనని ఆమె అభివర్ణించారు. అదనపు జిల్లాజడ్జి శ్రీనివాస్ మాట్లాడుతూ  గృహాలలో, కార్యలయాలలో జనజీవితానికి తేదీలు, వారాలను ఎరుకజేసే క్యాలెండర్ కహానీ పెద్దదే నని అన్నారు. కార్యక్రమంలో కుని సివిల్ జడ్జిలు హరి కుమార్, శ్రీనివాసరావు, జ్యూడిషియల్ అసోసియేషన్ అధ్యక్షురాలు సుజాత, ప్రధాన మంత్రి హరి ప్రసాద్, కోశాధికారి ఎమ్. ఎ రషీద్, నేతలు పద్మ,జ్యోతి,సుష్మా, దామోదర రెడ్డి,నాగేందర్, అనిశెట్టి చంద్రశేఖర్, అర్జున్, ప్రకాష్,మహమ్మద్ అజరుద్దీన్,తదితరులు పాల్గొన్నారు.