కామారెడ్డి, బతుకమ్మ: ఎన్నికల వేళ బీబీపేట మండలంలో హత్య కలకలం రేపింది. బీబీపేట్ మండలం రాంరెడ్డిపల్లె గ్రామంలో కోకోళ్ల సత్తయ్య అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గత కొంతకాలంగా ఇరు వర్గాల మధ్య భూతగాద నడుస్తోంది. మంగళవారం రాత్రి జరిగిన గొడవలో సత్తయ్య తలపై కర్రతో లచ్చయ్య అనే వ్యక్తి బాదాడు. తీవ్ర రక్తస్రావంతో సత్తయ్య మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.