మహిళ దారుణ హత్య

నందిపేట మండలం ఐలాపూర్ గ్రామ శివారులో ఘటన నందిపేట, బతుకమ్మ : నందిపేట మండలం ఐలాపూర్ గ్రామ శివారులో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది.  మృతురాలిని షాపూర్ గ్రామానికి చెందిన సాద సుమలత (35) గా గుర్తించారు. సోమవారం సాయంత్రం నందిపేటలో మార్కెట్ కు వెళ్లి తిరిగిరాకపోవడంతో కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. కాగా, ఆమెను అత్యాచారం చేసినంతరం హత్య చేసి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  మృతదేహం పక్కన మద్యం గ్లాసులు ఉన్నాయి. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ జరపుతున్నారు.  మరిన్ని...