పాల వ్యాపారి దారుణ హత్య
మాచారెడ్డి, బతుకమ్మ- కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండల కేంద్రానికి చెందిన దువ్వల బాలకిషన్ అనే పాల వ్యాపారిని కొందరు దుండగులు ఇస్సాయిపేట శివారులోని చెట్టుకు ఉరేసి దారుణంగా హత్య చేశారు. ఇది గమనించిన గ్రామస్తులు దుండగులను వెంబడించడంతో అక్కడి నుంచి పరారయ్యారు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.