- “పెళ్లి కానీ ప్రసాద్” సినిమా తో యువ దర్శకుడిగా మెరిసిన అబిలాష్ రెడ్డి
హైదరాబాద్, బతుకమ్మ : తెలంగాణ మట్టిలో పుట్టిన ఓ సాధారణ కుర్రాడు.. తన కలలకు రూపమిస్తూ, నవ్వుల వెనక వినూత్న సందేశాన్ని మిళితం చేసి “పెళ్లి కానీ ప్రసాద్” అనే ప్రత్యేకమైన చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించాడు. ఈ సినిమా ఇటీవలే తెలంగాణ పలు థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శించబడింది. ప్రేక్షకుల ప్రేమ, మాటల్లో నవ్వులు, కథలో కొత్తదనం – అన్నీ మంచి స్పందన తెచ్చుకున్నాయి. ఇప్పుడు… ఆ సినిమా మీ ఇంటికే వచ్చింది!
నేటి నుండి “పెళ్లి కానీ ప్రసాద్” Amazon Prime Video లో స్ట్రీమింగ్‌కి అందుబాటులో ఉంది! థియేటర్‌కు వెళ్లలేకపోయిన వాళ్లు.. ఇప్పుడు ఇంట్లోనే కూర్చొని, మీ ఫ్యామిలీతో కలిసి చూసేయండి. నవ్వులూ, భావాలూ, ఆలోచనలూ కలిపిన ఈ సినిమా తప్పకుండా మీ మన్ననలు పొందుతుంది. ఈ గొప్ప అవకాశాన్ని యువ దర్శకుడికి కల్పించి, ఆయన్ని ప్రోత్సహించిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు గారికి నిజామాబాదు ప్రజల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. మీ ఆదరణ వల్లే, మన యువత ప్రతిభ ప్రపంచానికి కనిపించేలా మారుతోంది.

- ఒక కల.. ఒక పల్లె.. ఒక అవకాశం..
అదే ఇప్పుడు – ఒక గుర్తింపు – ఒక గర్వకారణం! అబిలాష్ రెడ్డి ఇందూరు లోని ముబారక్ నగర్ వాసి తల్లితండ్రులు ముత్యం రెడ్డి, కుసుమలత కుమారుడు అబిలాష్ రెడ్డి నగరం లోని ప్రముఖ విజయ్ పబ్లిక్ హైస్కూల్ లో ఉన్నత విద్య పూర్తి చేశారు వారి తల్లి తండ్రులు ఇక్కడే ఉంటూ కష్టపడి చదివించి సినీమా రంఘం మీద ఉన్నా ప్రేమతో పలువురు సీనియర్ దర్శకుల వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ పని చేసి అనుభవం తో కోవిడ్ సమయం లో ముగ్గురు మొనగాళ్లు సినిమా తో అరంగేట్రం చేసి అవుర అనిపించాడు ఇప్పుడు పెళ్లి కానీ ప్రసాద్ సినిమా తో తెలంగాణ యువత కు దగ్గరయ్యాడు మన నిజామాబాదు వాసి అభిలాష్ రెడ్డి మ్యారెన్నో ఉన్నత సినిమాలు తీయాలని నగర పుర ప్రముఖులు హర్షిస్తున్నారు. అబిలాష్ రెడ్డి.. నీ సినిమాటిక్ ప్రయాణం ఇప్పుడు మొదలైంది. మరిన్ని విజయాలతో, గొప్ప కథలతో ముందుకు సాగాలి.
