సనాతన ధర్మస్థాపన కోసం బోర్డు ఏర్పాటు చేయాలి
నిజామాబాద్, బతుకమ్మ: సనాతన ధర్మ స్థాపన కోసం ప్రత్యేకంగా బోర్డు ఏర్పాటు చేయాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. జిల్లా కేంద్రంలో మీడియాతో ఆయన తిరుపతి లడ్డూ కల్తీపై సమగ్ర విచారణ జరిపించాలని, కేంద్రం సైతం ఈ అంశంపై సీరియస్ గా ఉందన్నారు. తిరుమలలో ఒక్క లడ్డూ విషయంలోనేకాకుండా భక్తులు అనేక విషయాల్లో ఇబ్బందులు పడ్డారన్నారు. హిందూ సమాజం ఐక్యతను దెబ్బతీసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం బీజేపీనే.. తెలంగాణలో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం బీజేపీనేని ఎంపీ అర్వింద్ అన్నారు....