Batukammanews
Newspaper Banner
Date of Publish : 02 December 2024, 7:26 pm Posted by : ramakrishna

బదిలీ అయిన పాఠశాల అటెండర్ కు ఘన సన్మానం

బతుకమ్మ,ఏర్గట్ల: ఏర్గట్ల ఉన్నత పాఠశాలలో దాదాపు 18 సంవత్సరాల పాటు అమూల్యమైన సేవలు అందించి, మోర్తాడ్ మండలం తిమ్మాపూర్ పాఠశాలకు బదిలీ పై వెళ్లిన  సంజీవమ్మ కు పాఠశాల తరుపున ఘన సన్మానం నిర్వహించారు.18 సంవత్సరాల పాటు పాఠశాల కోసం ఎన్నో సేవలు చేసి,అందరి మన్ననలు పొందిన సంజీవమ్మ సేవలు చాలా గొప్పవని, అహర్నిశలు పాఠశాల కోసమే తపనపడ్డ గొప్ప సేవకురాలని, సంజీవమ్మ పాఠశాల నుండి బదిలీపై వెళ్ళినందుకు చాలా బాధగా ఉందని పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు కొమరగిరి కృష్ణాచారి అన్నారు. పాఠశాలలోని ఉపాధ్యాయులు అందరూ కూడా ఆమె చేసిన సేవలను కొనియాడారు.అమూల్యమైన సేవలను అందించిన సంజీవమ్మకు పాఠశాల బృందం ఘనంగా సన్మానాన్ని కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు మునిరుద్దీన్, ప్రసాద్, పవన్, రాజ నరసయ్య, విజయ్, రాజేందర్, ప్రవీణ్ శర్మ, గంగాధర్, నరేష్, శ్రీనివాస్, జ్యోతి, సబిత, సమత, ట్వింకిల్, తదితరులు పాల్గొన్నారు.