Batukammanews
Newspaper Banner
Date of Publish : 03 January 2025, 4:58 pm Posted by : ramakrishna

భారతదేశ అణగారిన వర్గాల ప్రజల విద్యాజ్యోతి

బతుకమ్మ, మోర్తాడ్: సావిత్రిబాయి పూలే 194వ జయంతిని పురస్కరించుకుని మోర్తాడ్ మండలంలోని పాలెం గ్రామానికి చెందిన బోడ ధన్సిక మహారాణి అనే ఆరు సంవత్సరాల బాలిక సావిత్రిబాయి పూలే జన్మదినోత్సవం సందర్భంగా తన చేతిలో పుస్తకం,సంప్రదాయ చీరకట్టు వేషాదారణతో మనస్ఫూర్తిగా అభివాదం తెలియజేసింది. తనలాంటి బాలబాలికలకు 180 సంవత్సరాల క్రితమే విద్యాభ్యాసాన్ని ప్రారంభించి అందరి జీవితాల్లో వెలుగులు నింపిన విద్యాజ్యోతి మతా సావిత్రిబాయి పూలే గారని తన కృషితోనే నేను ఈరోజు చదువుకోగలుగుతున్నానని అంత గొప్ప మహనీయురాలి జీవిత చరిత్రను పరిచయం చేసిన తన తల్లిదండ్రులు బోడ అలేఖ్య మహారాణి – ఉమేష్ మహారాజ్ కి కృతజ్ఞతలు తెలియజేసింది! ఈ సన్నివేశాన్ని చూసిన అందరికీ ఆశ్చర్యంగా మంత్రముగ్దుల్ని చేసింది!