టిపిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ చిత్రపటానికి పాలాభిషేకం
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ ప్రాంతం విద్యార్థులకు ఇంజనీరింగ్ కళాశాల కావాలనే 30 ఏళ్ల నిజామాబాద్ జిల్లా విద్యార్థుల పోరాటం, నిరీక్షణ కు తెరదించుతూ, దశాబ్దాల కలను సాకారం చేసి నిజామాబాద్ జిల్లాకు ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల మంజూరు చేయించడానికి కృషిచేసిన టి పిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కి కృతజ్ఞతలు తెలుపుతూ తెలంగాణ విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల ముందు ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేసి, టపాసులు పేల్చి విద్యార్థులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పుప్పాల రవి మాట్లాడుతూ దశాబ్దాల కలను సహకారం చేస్తూ నిజామాబాద్ ప్రాంత విద్యార్థుల సౌకర్యార్థం ఇంజనీరింగ్ కళాశాలను ఏర్పాటుకు ప్రభుత్వం జీవో ని విడుదల చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేయడం వల్ల విశ్వవిద్యాలయం అభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని ఆయన తెలిపారు. గతంలో ఇదే కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ జిల్లాకు ప్రతిష్టాత్మక తెలంగాణ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తే, నేడు మరో మారు విశ్వవిద్యాలయ అభివృద్ధికి నిధులను కేటాయించడమే కాకుండా వివిధ కోర్సులను ప్రవేశపెడుతూ విశ్వవిద్యాలయ ఖ్యాతిని పెంచుతున్న కాంగ్రెస్ పార్టీకి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటుకు కృషి చేసిన టిపిసిసి అధ్యక్షులు ఉమా మహేష్ కుమార్ గౌడ్, స్థానిక శాసనసభ్యులు భూపతి రెడ్డి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, బోధన్ ఎమ్మెల్యే, మాజీ మంత్రివర్యులు సుదర్శన్ రెడ్డి, తెలంగాణ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్లర్, రిజిస్టర్ లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.