జోరుగా వంద రోజుల ప్రణాళిక
నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ మున్సిపల్ పరిధిలో జోరుగా వంద ప్రణాళిక కొనసాగుతుందని కమిషనర్ దిలీప్ కుమార్ తెలిపారు. ఇందులో భాగంగా మున్సిపల్ సిబ్బంది సోమవారం ఖాన్ పూర్ లో మురికి కాలువలు, రోడ్లు శుభ్రపర్చారు. మాణిక్ భండార్ లో దోమల బెడద నివారణకు మురికి కాలువల్లో ఆయిల్ బాల్స్ వేశారు. ఈకార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది జయ కుమార్, సాజిద్, తదితరులు పాల్గొన్నారు.