Batukammanews
Newspaper Banner
Date of Publish : 13 August 2024, 6:14 pm Posted by : ramakrishna

10 సంవత్సరాల బాలుడికి చిత్రహింసలు

  •  దత్తత తల్లితండ్రుల అమానుషం
  •  కాపాడిన స్థానికులు, పోలీసులు

బతుకమ్మ బోధన్ : దత్తత తీసుకున్న 10 సంవత్సరాల వయస్సు గల బాలుడిని చిత్రహింసలకు గురిచేసిన ఘటన చోటుచేసుకుంది. పోలీసుల సమాచారం మేరకు బోధన్ పట్టణము లోని రాకసిపేట్ ఏరియా లో 10 సంవత్సరాల బాలుడిని దత్తత తీసుకున్న తల్లితండ్రులు ఇంటి పనులు చేయాలంటూ బాలుడి కాళ్ళు, చేతుల పై కొట్టి చిత్రహింసలు గురిచేయడంతో బాలుడు పెద్ద కేకలు వేయడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సిఐ వీరయ్య సంఘటన స్థలానికి చేరుకొని పిల్లవాడిని రక్షించి, చైల్డ్ వెల్ఫేర్ అధికారులకు అప్పగించారు.