27.6 C
Hyderabad

ఎల్ఐసి కార్యాలయంలో  ఘనంగా బతుకమ్మ పండుగ

Bathukamma festival celebrated grandly at the LIC office

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

నిజామాబాద్ నగరంలోని ఎల్లమ్మ గుట్టలో గల ఎల్ఐసి కార్యాలయంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం సాయంత్రం ఎల్ఐసి కార్యాలయం ఆవరణలో సంస్థ మహిళా ఉద్యో గులు,  ప్రైవేట్ సిబ్బంది, ఏజెంట్ల సంఘం సహకారంతో ఉత్సవాలు నిర్వహించారు. మహిళలు ఉత్సాహభరితంగా పాటలు పాడుతూ, బతుకమ్మ ఆడుతూ సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో  ఏజెంట్ల సంఘం అధ్యక్షుడు దినేష్ కుమార్, ప్రధాన కార్యదర్శి లింగన్న, కోశాధికారి సుధాకర్, ఇన్చార్జి అల్లోల శ్రీనివాసరెడ్డి,  హయ్యర్ గ్రేడ్ అసిస్టెంట్  జయంతి, మహిళా సిబ్బంది  రజిని,  దివ్య, నవీన, సుశీల, మంజుల తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article