27.1 C
Hyderabad

పబ్లిక్ స్కూల్స్ కోసం.. ప్రైవేట్ స్కూళ్లను మూసివేయాలా

Should private schools be closed for the sake of public schools?

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ప్రభుత్వ జీవో 93 ను తక్షణం వెనక్కి తీసుకోవాలి

 

. . . ట్రస్మా సమావేశంలో తీర్మాణం

 

నిజామాబాద్ సిటి, బతుకమ్మ:

తెలంగాణ పబ్లిక్ స్కూల్స్  కోసం.. ప్రైవేట్ స్కూళ్లను మూసివేయాలంటూ ఇచ్చిన జీవో  93 తక్షణ వెనక్కి తీసుకోవాలని తెలంగాణ ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యం డిమాండ్ చేసింది. నిజామాబాద్ ట్రస్మా ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా.. ట్రస్మా రా ష్ట్ర గౌరవ అధ్యక్షుడు యాదగిరి శేఖర్ రావు ప్రభుత్వానికి పలు డిమాండ్లు పెట్టారు. రాజ్యంగ విరుద్దంగా జారీ చేసిన జీవో 93ను వెనక్కి తీసుకోవాలని కోరారు.  ప్రైవేట్ స్కూళ్ల  టీచర్లకు డబుల్ బెడ్ రూం ఇళ్లు, హెల్త్ కార్టులు ఇవ్వాలని తిర్మాణం చేశారు. ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలపై వేధింపులు మానుకోవాలని కోరారు. ప్రైవేట్ స్కూల్ టీచర్లకు రక్షణ కల్పించాలని, అందుకు కావాల్సిన చట్టం చేయాలని కోరారు. ఈ  డిమాండ్లతో ప్రభుత్వం పెద్దలను కలుస్తామన్నారు…

Should private schools be closed for the sake of public schools?
 

. . . సిబిఐ మాజీ జేడి లక్ష్మినారాయణ చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డుల ప్రధానం

ట్రస్మా నిజామాబాద్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు జరిగాయి. నగర బైపాస్ రోడ్డులోని గల పైడి కన్వెన్షన్ హాల్లో అదివారం ట్రస్మా అధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార ప్రదానోత్సవం-2025 కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రిటైర్డ్ అడిషనల్ డీజీపీ, మాజీ జాయింట్ డైరెక్టర్ (సి.బి.ఐ) వి.వి. లక్ష్మీనారాయణ, ఉపాధ్యక్షులు (అడ్వకేసీ) ఎన్ ఐ ఎస్ ఏ [నేషనల్ ఇండిపెండెంట్ స్కూల్స్ అలయన్స్]డాక్టర్ జె.ఎస్. పరంజ్యోఫి, ట్రస్మా రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు వై. శేఖర్ రావు, రాష్ట్ర అధ్యక్షులు ఎస్ యాదగిరి, నిజామాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ లు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథుల చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన చేసి ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు, ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార ప్రదానోత్సవం-2025 కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రిటైర్డ్ అడిషనల్ డీజీపీ, ఎక్స్ జాయింట్ డైరెక్టర్ సి.బి.ఐ వి.వి. లక్ష్మీనారాయణ మాట్లాడుతూ… ఉత్తమ విలువలతో కుడిన విద్యా బోధన ఫలితాలను ఇస్తుందని అన్నారు. విద్యార్ధులకు చదువు తో సాంకేతిక అంశాలను కుడా జోడించి విధ్య బోదన జరుగాలని అన్నారు. నేషనల్ ఇండిపెండెంట్ స్కూల్స్ అలయన్స్ ఉపాధ్యక్షులు డాక్టర్ జె.ఎస్. పరంజ్యోఫి… ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల పనితీరును ప్రశంసిస్తూనే  ఉపాధ్యాయులు ఎలా విధులు నిర్వహిస్తున్నారు ఎలా చేయాలి, ఇలా ముందుకు వెళ్లాలి అందులో మెలకువలను వారికి క్లుప్తంగా వివరించారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుని ఉపాధ్యాయులలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార ప్రదానోత్సవం-2025 అవార్డులను శాలువాతో సత్కరించి ముఖ్య అతిథుల చేతుల మీదుగా ఘనంగా సన్మానించారు. మొత్తంగా 156 మంది ఉపాధ్యాయిని ఉపాధ్యాయులను సన్మానించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కోశాధికారి జయసింహ గౌడ్, రాష్ట్ర అడ్వైజర్ మోహన్, స్టేట్ జాయింట్ సెక్రెటరీ రమేష్, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ రామారావు, నిజామాబాద్ జిల్లా ట్రస్మా అధ్యక్షులు నిత్యానందం, ప్రధాన కార్యదర్శి అరుణ్, జిల్లా కోశాధికారి మధు, పాఠశాలల కరస్పాండెంట్లు, ప్రిన్సిపాల్ లు, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Should private schools be closed for the sake of public schools?

More articles

Latest article