ఇందూర్, బతుకమ్మ:
మాదిగ ఉద్యోగుల, విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు గా బాబా శ్రీనివాస్ (ఎడిఇ) ఎన్నికయ్యారు. ఆదివారం నిజామాబాద్ అర్ అండ్ బి గేస్ట్ హౌజ్ లో నూతన కార్యవర్గం ( 2026-2028 ) ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా బాబా శ్రీనివాస్, అసోసియేట్ అధ్యక్షుడుగా కేశపురం రమేష్ ( టిచర్), ప్రధాన కార్యదర్శిగా ఎర్రోళ్ల శ్రీనివాస్ ( సోషల్ వెల్ఫేర్ ), కోశాధికారిగా తుడుము రాములు ( రిటైర్డ్ ), ఉపాధ్యక్షులుగా వి.సాయిలు , జె.గంగయ్య , సంయుక్త కార్యదర్శిగా కే గంగాధర్ , ఆర్గనైజింగ్ సెక్రటరీగా టీ. నర్సయ్య , ప్రచార కార్యదర్శిగా ఈ రాజశేఖర్ లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీతయ్య, వినోద్ కుమార్, సిహెచ్ గంగాధర్ , కే రాజయ్య , ఎల్ ఎస్ రావు , మాలాద్రి పాల్గొన్నారు.

