. . . త్రివర్ణ పతాకాల పంపిణీ కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసి దేశభక్తిని చాటాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ తెలిపారు. బీజేపీ ఆధ్వర్యంలో సోమవారం నగరంలోని బస్ స్టాండ్ వద్ద త్రివర్ణ పతకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. స్వాతంత్ర్య సమరయోధుల పోరాట స్ఫూర్తితో దేశ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపుమేరకు ప్రతి సంవత్సరం “హర్ ఘర్ తిరంగా” కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. కేవలం స్వాతంత్ర దినోత్సవం ఒక్కరోజు జెండా ఎగురవేయడమే కాకుండా ఇంటిపై నిత్యం రెపరెపలాడాలన్నారు. అలాగే ఈ నెల 14న జరిగే తిరంగా ర్యాలీలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి, జిల్లా ప్రధాన కార్యదర్శి నాగోల్ల లక్ష్మీనారాయణ, పోతన్కర్ లక్ష్మీ నారాయణ, ఫ్లోర్ లీడర్ ప్రమోద్, కార్పొరేటర్లు పాల్గొన్నారు.

