26.3 C
Hyderabad
Monday, August 3, 2026

జగిత్యాలలో కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

Must read

📰 Generate e-Paper Clip

 

జగిత్యాల, బతుకమ్మ :

 

జగిత్యాల జిల్లా ధరూర్ క్యాంప్‌లోని పాత ఎస్సీ కార్యాలయ భవనంలో తాత్కాలిక ప్రాంగణంలో నిర్వహిస్తున్న కేంద్రీయ విద్యాలయం చెల్గల్‌లో 2026–27 విద్యా సంవత్సరానికి విద్యార్థుల ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది. విద్యాలయంలోని వివిధ తరగతుల్లో ప్రవేశాల కోసం ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు విద్యాలయ యాజమాన్యం వెల్లడించింది. అర్హత కలిగిన విద్యార్థుల తల్లిదండ్రులు నిర్ణీత గడువులోగా దరఖాస్తులను సమర్పించాలని సూచించింది. ప్రవేశాలకు సంబంధించిన అర్హతలు, అవసరమైన పత్రాలు, సీట్ల లభ్యత తదితర పూర్తి వివరాల కోసం తల్లిదండ్రులు నేరుగా కేంద్రీయ విద్యాలయాన్ని సంప్రదించాలని అధికారులు తెలిపారు.

More articles

Latest article