23.3 C
Hyderabad
Sunday, August 2, 2026

వంతెనల అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

నగరంలోని వంతెనల అభివృద్ధి పనులకు సంబంధించి నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ కోరారు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ని గురువారం రాత్రి ఢిల్లీలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తో కలిసి ప్రతిపాదనలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నగరంలోని దేవీ రోడ్డు – నాందేవాడ (ఆర్ వోబీ) అదనపు వంతెన మంజూరు చేయాలని కోరడం జరిగిందన్నారు. ప్రధానంగా ఈ రైల్వే లైను దాటడానికి విజయ థియేటర్, అలాగే నాందేవాడ వద్ద రెండు మార్గాలు మాత్రమే ఉన్నాయన్నారు. రద్దీ ఎక్కువగా కావడంతో ట్రాఫిక్ సమస్యలు తప్పడం లేదని, కావున నూతన ఆర్ వోబీ మంజూరు చేయాలన్నారు. అలాగే ఎల్లమ్మగుట్ట వద్ద సోనీ ఫంక్షన్ హాల్ సమీపంలో మరొక ఆర్ యూబీ అత్యంత ఆవశ్యకమన్నారు. ఇందుకోసం రూ.170 కోట్లు మంజూరు కావాలన్నారు.

 

Funds must be sanctioned for bridge development works.

More articles

Latest article