నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా సంయుక్త కార్యదర్శిగా నాయి బ్రాహ్మణ సంఘానికి చెందిన అనిల్ కుమార్‌ను నియమించినట్లు జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బీసీల సంక్షేమం, హక్కుల పరిరక్షణ కోసం అనిల్ కుమార్ ఎన్నో సంవత్సరాలుగా సేవలందిస్తున్నారని పేర్కొన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి పోల్కం గంగా కిషన్ మాట్లాడుతూ, బీసీల హక్కుల సాధనతో పాటు నాయి బ్రాహ్మణ కుల సభ్యుల అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తున్న అనిల్ కుమార్ నియామకంతో బీసీ సంక్షేమ సంఘం మరింత బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్, జిల్లా ప్రధాన కార్యదర్శి పోల్కం గంగా కిషన్‌తో పాటు దర్శనం దేవేందర్, కొయ్యాడ శంకర్, కోడూరు స్వామి, రవణ స్వామి, గంగాధర్, సురేందర్, నరహరి, గోపి తదితర నాయకులు పాల్గొని అనిల్ కుమార్‌కు అభినందనలు తెలిపారు.
