26.6 C
Hyderabad
Monday, August 3, 2026

ధూప దీప నైవేద్య అర్చక సంఘం ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం

Must read

📰 Generate e-Paper Clip

 

రుద్రూర్, బతుకమ్మ :

 

హైదరాబాద్ లోని బుక్కుల కుంట సరస్వతి భవనంలో తెలంగాణ రాష్ట్ర ధూప దీప నైవేద్య అర్చక సంఘం ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నిజామాబాద్ జిల్లా నుండి జిల్లా అధ్యక్షులు రాచప్ప స్వామి, ప్రచార కార్యదర్శి బి.సంతోష్, మహేందర్,  భాస్కర్, రాష్ట్ర అధ్యక్షులు   దౌలతాబాద్ వాసుదేవ్ శర్మ, ప్రధాన కార్యదర్శి అమరేశ్వర శర్మ, కోశాధికారి నందన హరికృష్ణ, ఉపాధ్యక్షులు కృష్ణమాచార్యులు, రాష్ట్ర కన్వీనర్ రుద్రూర్ జే.శివ స్వామి తరలి వెళ్లారు. నిజామాబాద్ జిల్లా నుండి రాష్ట్ర కార్యవర్గంలో నూతన ఎన్నిక సమావేశం నిర్వహించగా, ఇందులో మట్టం  చన్న  బసప్ప స్వామి, కే.పరమేశ్వర్, నావనంది శివ ప్రమాణ స్వీకారం చేపట్టారు. వీరికి శాలువాతో ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు.

More articles

Latest article