29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

అవినీతి కేసులో సిఐ, ఎస్ఐ సస్పెన్షన్

Must read

📰 Generate e-Paper Clip

 

వరంగల్, బతుకమ్మ :

 

వరంగల్ పోలీస్ కమిషనరేట్ వెస్ట్ జోన్ పరిధిలోని నర్మెట్ట సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఎం. అబ్బయ్య, గతంలో బచ్చన్నపేట పోలీస్ స్టేషన్‌లో ఎస్‌ఐగా పనిచేసి ప్రస్తుతం ఏఆర్‌కు అటాచ్‌గా ఉన్న ఎస్‌ఐ షేక్ హమీద్‌పై సస్పెన్షన్ వేటు పడింది. వీరిరువురిపై వచ్చిన అవినీతి ఆరోపణలు నిర్ధారణ కావడంతో వారిని సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. శాఖాపరమైన విచారణలో ఆరోపణలకు ఆధారాలు లభించిన నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్లు కమిషనర్ వెల్లడించారు. సీఐ ఎం. అబ్బయ్య గతంలో కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహించిన సమయంలోనూ ఆయనపై పలు అవినీతి ఆరోపణలు వచ్చినట్లు సమాచారం.

More articles

Latest article