నిజామాబాద్ క్రైం, బతుకమ్మ:
సౌండ్ బాక్స్ ల వినియోగం పై ఉన్న నిషేధజ్ఞలు ఉల్లంగించి లైసెన్స్ లేని వ్యక్తులు సౌండ్ సిస్టం లను కిరాయి కి ఇచ్చిన యజమానికి న్యాయస్థానం ఓక్కరోజు జైలు శిక్ష విధించిందని నిజామాబాద్ ఓకటవ టౌన్ ఎస్ హెచ్ఓ రఘుపతి తెలిపారు. మోపాల్ మండలం కులాస్ పూర్ గ్రామానికి చెందిన నిమ్మల వంశీ సౌండ్ బాక్స్ ల వినియోగం పై ఉన్న నిషేధజ్ఞలు ఉన్న సమయంలో ఇటివల దసరా పండగ సంధర్బంగా తన డిజేను లైసెన్స్ లేని వ్యక్తులకు అద్ధేకు ఇచ్చారు. ఈమేరకు ఓకటవ టౌన్ పోలిసులు వంశీపై కేసు నమోదు చేసి బుదవారం కోర్టులో హజరుపరిచారు. వంశీకి ఓక్కరోజు జైలు శిక్ష విధిస్తు నిజామాబాద్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ తీర్పు చెప్పారని ఎస్ హెచ్ఓ తెలిపారు.
