27.3 C
Hyderabad
Friday, July 31, 2026

ఉత్సాహభరితంగా కొనసాగుతున్న క్రికెట్ టోర్నమెంట్

Must read

📰 Generate e-Paper Clip

 

. . . నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య

 

నిజామాబాద్, బతుకమ్మ :

 

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న  క్రికెట్ టోర్నమెంట్ ఉత్సాహభరితంగా కొనసాగుతుందని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. ఈ టోర్నమెంట్ లో రెండవ రోజైన మంగళవారం మొత్తం నాలుగు మ్యాచ్‌లు విజయవంతంగా నిర్వహించబడ్డాయన్నారు. ప్రతి మ్యాచ్‌లోనూ ఆటగాళ్లు తమ ప్రతిభను ప్రదర్శిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారని, టోర్నమెంట్ మరింత రసవత్తరంగా సాగుతుండగా, తదుపరి మ్యాచ్‌లపై ఆసక్తి మరింత పెరుగుతోందని తెలిపారు. మొదటి మ్యాచ్ గజానన్ టీం, గుండారం లెవన్ మధ్య జరగగా గజానన్ టీం గెలుపొందింది. రెండవ మ్యాచ్ వేల్పూరు పీఎస్, ముప్కాల్ లెవన్ మద్య జరుగగా వేల్పూరు పీఎస్ విజేతగా నిలిచింది. మూడవ మ్యాచ్ చత్రపతి శివాజీ, అమ్దాపర్ టీం మద్య జరుగగా చత్రపతి టీం గెలుపొందింది. నాల్గవ మ్యాచ్ మోహన్ లెవన్, వర్ని వారియర్స్ మద్య జరుగగా వర్ని వారియర్స్ వాక్ ఓవర్ చేయడంతో మోహన్ లెవన్ ని విన్నర్ గా ప్రకటించారు.

 

An exciting cricket tournament continues

More articles

Latest article