పిట్లం, బతుకమ్మ: షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధమై ఇబ్బందుల్లో ఉన్న ఏసుమణి కుటుంబానికి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అండగా నిలిచింది. సొసైటీ తరఫున గురువారం బాధితురాలికి కిరిణా, వంటసామగ్రి, బియ్యం తదితర వస్తువులను అందజేశారు. మండల ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ బుగూడాల నవీన్ కుమార్, బాన్సువాడ డివిజన్ చైర్మన్ మర్గాల వేణుగోపాల్, పిట్లం వైస్ చైర్మన్ బొడ్ల రాజు, కాలనీవాసులు భూమేశ్, ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు.
