29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

ఎదురెదురుగా ఢీకొన్న ద్విచక్ర వాహనాలు

Must read

📰 Generate e-Paper Clip

. ఒకరి పరిస్థితి విషమం

. ముగ్గురికి తీవ్ర గాయాలు

ఇందల్వాయి,బతుకమ్మ: మండల కేంద్రంలో గ్రామంలోకి ప్రవేశించే మూలమలుపు వద్ద బుధవారం మధ్యాహ్నం ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. సమాచారం అందుకున్న స్థానిక ఎస్సై మనోజ్ కుమార్ ఘటనాస్థలానికి చేరుకొని గాయాలపాలైన వారిని అంబులెన్స్ లో జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉండగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయని ఎస్సై తెలిపారు. ముగ్గురు వ్యక్తులు ధర్మారం(బర్దిపూర్)గ్రామానికి చెందిన వారని, మరొకరు ఇందల్వాయిలో సఫాయీ కార్మికుడిగా పనిచేస్తున్న తలారి భూపతి అని, అతడికి తీవ్ర గాయాలయ్యాయన్నారు.

https://batukammanews.com/two-wheelers-collide-head-on/

 

More articles

Latest article