ఎల్లారెడ్డి, బతుకమ్మ :
ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలోని 2వ వార్డు నయాబాది రోడ్డు మధ్యలో శిథిలావస్థలో ఉన్న విద్యుత్ స్తంభాన్ని తొలగించి నూతన పోల్ ను వేయడంతో కాలనీవాసుల సంతోషం వ్యక్తం చేశారు. రోడ్డు మధ్యలో విద్యుత్ పోల్ తో తీవ్ర ఇబ్బందులు నెలకొనడంతో కాంగ్రెస్ నాయకులు విద్యాసాగర్ ట్రాన్స్ కో అధికారులు డిఈ విజయసారథి, ఏఈ వెంకటస్వామిలను కోరడంతో డిఈ వార్డ్ కి వచ్చి చూసి ప్రమాద కరంగా ఉన్న పోల్ తొలగించి నూతన పోల్ వెయ్యాలని కాంట్రాక్టర్ ను ఆదేశించారు. దీంతో కాలనీ వాసుల తరుపున విద్యాసాగర్ ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సుజిత్, కాలనీ వాసులు పాషా,నర్సింలు,లైన్ మెన్ శశికాంత్ రెడ్డి పాల్గొన్నారు.
