26.2 C
Hyderabad
Monday, August 3, 2026

తహసీల్దార్‌ కార్యాలయంలో ఇష్టారాజ్యం…

Must read

📰 Generate e-Paper Clip

 

– సమయపాలన పాటించని అధికారులు, సిబ్బంది

రుద్రూర్, బతుకమ్మ  :

రుద్రూర్ మండల కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయంలో సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. కార్యాలయంలో అధికారులు, సిబ్బంది సమయపాలన పాటించడం లేదు. బుధవారం ఉదయం 11 గంటల వరకు కూడా కార్యాలయంలో అధికారులు, సిబ్బంది రాకపోవడం గమనార్హం. దీంతో పని నిమిత్తం కార్యాలయానికి వచ్చిన ప్రజలు వేచిచూడాల్సిన పరిస్థితి నెలకొంది. కార్యాలయ సిబ్బంది పనితీరుపై మండల ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతోనే కార్యాలయ అధికారులు, సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి సమయపాలన పాటించని కార్యాలయ అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.

More articles

Latest article