25.3 C
Hyderabad
Tuesday, August 4, 2026

చిన్నారెడ్డిపై ఎమ్మెల్యే మేఘారెడ్డి సంచలన ఆరోపణలు

Must read

📰 Generate e-Paper Clip

వనపర్తి, బతుకమ్మ :  చిన్నారెడ్డిపై వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వనపర్తిలో శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో కాంగ్రెస్ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థుల ఓటమికి చిన్నారెడ్డే కారణమని ఆరోపించారు. పంచాయతీ ఎన్నికల్లో చిన్నారెడ్డి వెన్నుపోటు పొడిచారని పేర్కొన్నారు. తనకు, ఎంపీ మల్లు రవికి నష్టం చేశారని ఆరోపించారు. అధిష్టానం పెద్దలకు ఆధారాలతో ఈవిషయమై ఫిర్యాదు చేస్తానని పేర్కొన్నారు. వనపర్తిలో ఒరిజినల్‌ కాంగ్రెస్‌ తానేనని స్పష్టం చేశారు.

 

 

 

More articles

Latest article