30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ,భీమ్ గల్ : మండల కేంద్రంలోని లిటిల్ ఫ్లవర్ హైస్కూల్ విద్యార్థులు మంగళవారం నిర్వహించిన బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటాయి. స్కూల్ కరస్పాండెంట్ డాక్టర్ షఫీ, మేనేజింగ్ డైరెక్టర్ సనా ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ సంబురాలను విద్యార్ధినులు అంగరంగ వైభవంగా జరుపుకొన్నారు.

Bathukamma celebrations like Ambaran

డీ జె బతుకమ్మ పాటలతో సాంప్రదాయ బతుకమ్మ చిందులు వేస్తూ, కొళాటం ఆడుతూ, భక్తి శ్రద్దలతో బస్టాండ్ వరకు ఊరేగింపు నిర్వహించారు. తొమ్మిది రోజులు జరుపుకొనే ఈ పండుగను మొదటి రోజు విద్యార్థినులు తీరొక్క పువ్వులతో అందంగా పేర్చి రంగు రంగుల బతుకమ్మలను తయారు చేసి భక్తి శ్రద్దలతో చెరువులో నిమజ్జనం చేశారు.

Bathukamma celebrations like Ambaran

విద్యార్థులు తయారు చేసిన పదిహేను అడుగుల బొడ్డెమ్మ చూపరులను ఆకట్టుకొంది. ఈ కార్యక్రమం లో ప్రిన్సిపాల్ రాధాకృష్ణన్ నాయర్, ప్రైమరీ ఇంచార్జి బిను, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ప్రకాష్, ఉపాధ్యాయులు మరియు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

Bathukamma celebrations like Ambaran

More articles

Latest article